తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ అధికారిణిగా అవార్డు స్వీకరణ సమాజ సేవే పరమావధిగా, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిరంతరం శ్రమిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత లేనినాకు మరొక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమె కనబరిచిన అసమాన సేవలకు గాను రాష్ట్ర వ్యవసాయ, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా "జిల్లా ఉత్తమ ఉద్యోగిని" అవార్డును అందుకున్నారు. క్షేత్రస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విజయాల పరంపర స్వర్ణలత లేనినా సేవా ప్రస్థానం ఈనాటిది కాదు. క్షేత్రస్థాయి ఉద్యోగిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, నేడు జిల్లా స్థాయి అధికారిణిగా ఎదిగినంత వరకు ఆమె పనిచేసిన ప్రతి జిల్లాలోనూ తనదైన ముద్ర వేశారు. సాధారణ ఉద్యోగి నుండి ఉన్నతాధికారి వరకు ఆమె పనిచేసిన అన్ని ప్రాంతాలలోనూ "ఉత్తమ ఉద్యోగిని"గా పురస్కారాలు అందుకోవడం ఆమె నిబద్ధతకు, దక్షతకు తార్కాణం. ఒకే అధికారిణి ఇన్ని జిల్లాల్లో వరుసగా ఉత్తమ అవార్డులు సాధించడం ప్రభుత్వ శాఖల్లో ఒక అరుదైన ఘనతగా నిలిచింది.గిరిజన ప్రాంతాల్లో 'వేయి రోజుల సంరక్షణ' ఒక అద్భుత విజయం: మారుమూల, ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాతృ-శిశు మరణాల నివారణే ధ్యేయంగా ఆమె చేపట్టిన కార్యక్రమాలు విశేష ఫలితాలను ఇచ్చాయి. ముఖ్యంగా గర్భం దాల్చిన నాటి నుండి బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకు (తల్లి-బిడ్డల 1000 రోజుల సంరక్షణ) అత్యంత పటిష్టంగా నిర్వహించారు. ఏజెన్సీ లోతట్టు ప్రాంతాల్లోని గిరిజన గర్భవతులు, బాలింతలు, పసిపిల్లలకు పోషకాహారం అందించడంలో మరియు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఆమె అహర్నిశలు శ్రమించారు.సొంత కుటుంబాన్ని మరచి… ప్రజలనే కుటుంబంగా భావించి: నీతి, నిజాయితీ, సమయపాలన మరియు ప్రజాసేవలో రాజీపడని నైతికతకు ఆమె చిరునామాగా నిలిచారు. వ్యక్తిగత స్వార్థాన్ని, సొంత కుటుంబ సమయాన్ని పక్కనబెట్టి, జిల్లా ప్రజల సంక్షేమాన్నే తన సొంత కుటుంబ బాధ్యతగా భావించి విధులు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారునికి కూడా సమర్థవంతంగా అందేలా ఆమె క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అభినందనల వెల్లువ : మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం పట్ల జిల్లా కలెక్టర్, మహిళా ఉద్యోగులు, ఐసిడిఎస్ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గిరిజన సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. స్వర్ణలత లేనినా గారి నాయకత్వంలో పనిచేయడం తమకెంతో గర్వకారణమని, ఆమె సేవలు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలను తెచ్చిపెట్టాలని సహోద్యోగులు మరియు అభిమానులు ఆకాంక్షిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బందిని అంగనవాడి టీచర్ నుండి జిల్లా కార్యాలయ సిబ్బంది వరకు అందించిన సహాయ సహకారాలు నాకు ఈ గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టాయని, మునుమందు కూడా ఇదే ఉత్సాహంతోటి పనిచేసే గిరిజన ప్రజలకు మరింత చేరువై పోషకారలోపరహిత జిల్లాగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ