Wednesday, 16 September 2026 07:38:21 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భద్రాచలం–వాజేడు రహదారికి మోక్షం కల్పించండి. ఏపీ ఆర్‌అండ్‌బీ మంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి.

Date : 06 August 2026 06:46 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం నుంచి వాజేడు వరకు అధ్వాన్నంగా మారిన రహదారికి తక్షణమే మోక్షం కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కోరారు. బుధవారం ఈ మార్గంలో ప్రయాణించిన సందర్భంగా రహదారి దుస్థితిని చూసిన స్థానికులు మంత్రిని అడ్డుకుని తమ సమస్యలను వివరించారు. గతంలో మీరు ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారి నిర్మాణం జరిగిందని, అనంతరం ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 100 కిలోమీటర్ల ప్రయాణానికే మూడు గంటల సమయం పడుతోందని, ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు తెలిపారు.ప్రజల సమస్యలను విన్న వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి, సంబంధిత అధికారులకు, తెలంగాణ ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. రహదారి మరమ్మతులు, అభివృద్ధి పనులను అత్యవసరంగా ప్రారంభించి ప్రజల కష్టాలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి తుమ్మల స్థానికులకు హామీ ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రహదారి అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించినప్పటికీ కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం ఆందోళనకరమని మంత్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభం కాకపోతే ప్రస్తుత కాంట్రాక్టర్‌ను తొలగించి, కొత్త టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై మంత్రి జనార్దన్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భద్రాచలం–వాజేడు రహదారి అభివృద్ధి పనులు మొత్తం మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. భద్రాచలం నుంచి ఏటపాక వరకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 7.8 కిలోమీటర్ల రహదారిని రూ.3.70 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఏటపాక నుంచి చర్ల మండలంలోని సుబ్బంపేట వరకు 56.8 కిలోమీటర్ల మేర భద్రాద్రి డివిజన్ పరిధిలో రూ.67.58 కోట్లతో పనులు చేపట్టనున్నారు. సుబ్బంపేట నుంచి వాజేడు వరకు ములుగు డివిజన్ పరిధిలోని 48 కిలోమీటర్ల రహదారిని రూ.44 కోట్లతో నిర్మించనున్నారు. మొత్తం 112.6 కిలోమీటర్ల పొడవున సుమారు రూ.115.28 కోట్ల వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి కానుంది.ఈ పనులను ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ చీఫ్ ఇంజినీర్ బీవీ రావు పర్యవేక్షించనుండగా, భద్రాచలం, ములుగు ఈఈలు క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులు రహదారి దుస్థితి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :