తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని నరసాపురం గ్రామంలో ఉన్న గిరిజన విద్యార్థినుల హాస్టల్ ను సందర్శించటం జరిగింది. ఈ సందర్భంలో సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మచ్చ వెంకటేశ్వర్లు ప్రత్యక్షంగా పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. అలాగే హాస్టల్ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా హాస్టల్లో అవసరమైన ఉపాధ్యాయుల కొరత ఉందని అలాగే డైలీ వర్కర్ల సమస్య ఉందని విద్యార్థులకు ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదని అలాగే విద్యార్థునులకు ఇవ్వాల్సిన కాస్మోటిక్ ఇవ్వలేదని కార్పెట్ యూనిఫార్మ్స్ అలాగే నోట్స్ లు ఇవ్వలేదని విద్యార్థులు బృందం ముందు ఏకరు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రెండు సంవత్సరాలు గడుస్తున్నా సమస్య లను తీర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం మైకు పట్టుకుని గొప్పలు చెప్పుకుంటూ ఉంది తప్ప నేటికీ విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పాఠ్యపుస్తకాలు నూటికి నూరు శాతం అందలేదని అలాగే బాలికలకు అవసరమైన కాస్మోటిక్స్ హాస్టల్లో బస చేస్తున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన కార్పెట్స్ యూనిఫార్మ్స్ ట్రంకు పెట్టె లు ఇవ్వలేదని అలాగే హాస్టల్లో వర్షాకాలం విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఆ సందర్భంలో బాలికలు స్నానం చేయడానికి కానీ హాస్టల్లో పడుకోవటానికి గాని చాలా ఇబ్బంది గురవుతున్నారు అని తక్షణమే ప్రభుత్వం స్పందించి కలెక్టరు ఐటిడిఏ పిఓ గారు స్పందించి నరసాపురం ఆస్తులకు అవసరమైన ఔటర్ వాటర్ ట్యాంక్ అలాగే అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి జనరేటర్ తక్షణమే ఏర్పాటు చేయాలని బాలికలకు ఎటువంటి అంతరాయం కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు మరియు జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాసరావు పార్టీ మండల కార్యదర్శి యాస నరేష్ పార్టీ మండల కమిటీ సభ్యులు వల్లమళ్ల చందర్రావు రెడ్డి బోయిన గోవిందు గార్లపాటి వెంకటి తాటి పద్మ జల్లిక రాధాకృష్ణ బోడ అభిమిత్ర పార్టీ శాఖ కార్యదర్శి సీతారాములు తోలేము సరస్వతి సత్యనారాయణ దానయ్య బానోత్ సౌమ్య జర్పుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ