తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో గురువారం NSTI, FFSC మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్ ఫర్నిచర్ ప్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ శిక్షణకు సంబంధించిన డ్రాయింగ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ ఎంపికల కోసం ఆన్లైన్ లో 69 మంది పేరు నమోదు చేసుకాగా మొత్తం 29 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల ఫలితాల ఆధారంగా 19 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది.ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ అభినందనలు తెలిపారు. ఈ శిక్షణ నవంబర్ 17, 2025 నుండి NSTI–FFSC, హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.శిక్షణకు అవసరమైన ఒక్కో అభ్యర్థికి రూ. 5,000 రిజిస్ట్రేషన్ ఫీజును జిల్లా యంత్రాంగం భరిస్తుందని కలెక్టర్ తెలిపారు. శిక్షణ కాలమంతా ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలు CSR సహకారంతో అందించబడతాయని తెలిపారు.ఈ సందర్భంలో ANB ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఎక్స్పీరియాస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు శిక్షణ సమయంలో వసతి మరియు భోజన ఖర్చుల కోసం ఎంపికైన 7 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 87,500 చెక్కును కలెక్టర్ అందజేశారు. మిగిలిన 12 మంది అభ్యర్థులకు కూడా ఇతర సంస్థల ద్వారా CSR స్పాన్సర్‌షిప్ కల్పించబడింది.ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నాయర్ (వైస్ ప్రెసిడెంట్, FFSC), ఏ. సంతోష్ మారి (ట్రైనర్, FFSC), ఏపీఎం వెంకయ్య, ఏపీఎం ప్రసాద్ రెడ్డి, EDM సైదేశ్, దిలీప్, ర్యాంప్ కోఆర్డినేటర్స్, JRPలు, నందు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ