తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 14 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం లోని సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈనెల 16వ తారీకు న శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా నందగోపాలుడి పండుగ నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయంతో అత్యంత ఆధ్యాత్మికంగా ఆనందంగా నిర్వహించే ఈ పండుగ సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అత్యంత ఘనంగా నిర్వహించారు. చిన్నారులంతా శ్రీకృష్ణ, గోపికమ్మ వేషధారణలతో పాఠశాలలో పందడి చేశారు. సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ ఆర్తి మరియు కరస్పాండెంట్ సిస్టర్ సౌమ్య లు మాట్లాడుతూ విద్యార్థులకు శ్రీకృష్ణ అదే విధంగా వివిధ దైవతామూర్తుల చరిత్ర తెలియజేయటం వారికి అవగాహన కల్పించడం ద్వారా చదువుతోపాటు చరిత్ర తెలుసుకోగలుగుతారని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంపై అవగాహన కల్పిస్తున్నామని. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్కూల్ టీచర్స్ మరియు పిల్లల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ