తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకొని స్థానిక సెయింట్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్ నందు విద్యార్థినిలు మదర్ థెరిసా జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు మదర్ థెరీసా యొక్క జీవిత విశేషాలు సేవా కార్యక్రమాలు రోగులు,అభాగ్యులు అందరినీ ఆదరించి చికిత్స చేసి సేవలు అందించిన మదర్ థెరిసా యొక్క నిస్వార్థ సేవను కనులకు కట్టినట్టుగా విద్యార్థులు అందరి ముందర ప్రదర్శించారు మదర్ థెరిసా ప్రధాన పాత్ర పోషించిన నంది హిమ కీర్తన మరియు వారి మిత్రబృందం చేసిన ప్రదర్శనని ప్రధానోపాధ్యాయురాలు నిర్మల ప్రశంసించారు, మదర్ థెరీసా సేవాభావం అలవర్చుకొని సమాజానికి పాటుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు: నిర్మల, రూబీ, ఉష ఉపాధ్యాయులు: కల్పన, అరుణ, విజయశ్రీ, మాధవి, వాసుకి, ప్రేమ కుమారి, ప్రణవి, స్వరూప రాణి, కమల శ్రీ, శ్యామలత, లక్ష్మి విద్యార్థులు: హిమ కీర్తన, లక్ష్మీ కౌముది, దేవిశ్రీ, కుశల, సంప్రీతి, వైశాలి, అనన్య, వైష్ణవి, సంప్రీతి, లాస్య, సింధుజ, పరనిక, భూమిజ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ