Wednesday, 04 November 2026 11:11:46 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

రామవరం కార్మిక వాడల లో మంచినీటి సమస్యపై సూపర్వైజర్ కి వినతిపత్రాన్ని అందించిన సిపిఐ నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు.

Date : 05 April 2025 12:52 PM Views : 851

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 5 (తెలుగువెలుగు) : రామవరం కార్మికవాడలో గత వారం రోజుల నుండి సింగరేణి మంచినీళ్లు రాక కార్మిక వాడల్లో మంచినీటి ఎద్దడి నెలకొందని తక్షణమే మంచినీటి ఎద్దడికి సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకొని ,రామవరం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాలని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు సింగరేణి అధికారులకు విజ్ఞప్తి చేశారు. శనివారం రామవరం సివిల్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ షరీఫ్ కి ఆ ప్రాంత ప్రజలతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికవాడలోని సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల కుటుంబాలు, ఇతర కుటుంబాలు గత వారం రోజుల నుండి సకాలంలో మంచినీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే చర్యలు చేపట్టి రోజు రెండు పూటలా మంచినీళ్లు అందించాలని ఆయన కోరారు. మోటార్లు రిపేర్ అయినా సందర్భంలో యాజమాన్యం స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదని, తక్షణమే స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకొని మంచినీటి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపాలని ఆయన కోరారు. అలాగే త్రీ ఇంక్లైన్ ప్రాంతానికి సంబంధం లేకుండా రామవరం ప్రాంతానికి గతంలో మాదిరిగా మంచినీళ్లు అందిస్తే అందరికీ సరిపోను నీళ్లు అందుతాయని ఆయన విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంపై స్పందించిన సూపర్వైజర్ మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని సుమారు రేపు లేదా ఎల్లుండి సకాలంలో మంచినీళ్లు అందుతాయని ఆయన హామీ ఇచ్చారని వారు తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో ఉన్నదాసు గడ్డ టు శాఖ కార్యదర్శి సూరి మేని జనార్ధన్, బయన ఈశ్వరయ్య ,పదవ వార్డు శాఖ సభ్యులు కుమార్ ,దివాకర్, ఉప్పతల శ్రీను, గంగరాజు ,శంకర్, మహిళా నాయకురాలు ముద్దం మార్తమ్మ, బెల్లం బేబీ, ఏకాంత, బత్తుల పద్మ, కాపు అంజమ్మ ,విజయ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :