తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలం సారపాక సుందరయ్య నగర్ లో తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 43 వాహనాలను గుర్తించారు మరియు 46 క్వార్టర్ ల మద్యం ను సీజ్ చేయడం జరిగింది. వీటిలో బైక్‌లు, ఆటోలు ఉన్నాయి. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.అలాగే ప్రతి ఒక్కరూ బైక్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించాలని మరియు పౌరులందరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్వంచ సీఐ సతీష్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిపి సుమారు 50 మంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ