తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 9 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలంలో 23 పంచాయితీ లకు స్థానిక ఎన్నికలు జరుగుతుండడంతో మొదటిగా శేంబునిగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి తాటి సువార్త ను పంచాయతీ ప్రజలు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ఈరోజు వినోబా నగర్ గ్రామపంచాయతీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గంగావత్ నవీన్ ను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామస్తులు మాట్లాడుతూ కాంగ్రెస్ మండల నాయకులు చౌడం నరసింహారావు విజ్ఞప్తి మేరకు గ్రామపంచాయతీలో పోటీ లేకుండా ఆయన చూపించిన వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకున్నామన్నారు. ఘతం లో మండల ప్రెసిడెంట్ గా పని చేసిన చౌడం నరసింహారావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.పార్టీలలో పదవులు ఉన్న లేకున్నా ఆ పంచాయతీ ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారు. చిన్న చిన్న పంచాయతీలే పోటీ తప్పదని నామినేషన్లు ఉపసంహరించుకోము అంటున్న తరుణంలో పంచాయతీని ఏకగ్రీవం చేసిన చౌడం నరసింహారావును మండల ప్రజలు పార్టీలకు అతీతంగా హర్షిస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ