తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధిక ఫీజులతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్దులను,వారీ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మండిపడ్డారు.బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సుమిత్రా దేవి,లాయర్ సాదిక్ పాషాకు పిర్యాదు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను వ్యాపారం చేస్తూ కొన్ని విద్యాసంస్థలు సాధారణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.ఇష్టానుసారంగా దోచుకుంటున్న సంభందిత శాఖ అధికారులు పట్టించుకోక పొవడం పాలు అనుమానాలకు తావిస్తుందనీ పేర్కొన్నారు.నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు దండుకోవడమే కాకుండా కనీస నిబంధనలను పాటించడం లేదని విమర్శించారు.విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 25% సీట్లను ఉచితంగా ఇవ్వాలనే నిబంధనలను ఏ ఒక్క పాఠశాల యాజమాన్యం పాటించడం లేదని వివరించారు.14 సంవత్సరాల లోపు పిల్లలను ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురి చెయ్యొద్దనే నిబంధన ఉన్నప్పటికీ కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రం అందుకు విరుద్ధంగా పిల్లలు ఫీజులు కట్టలేదని పరీక్షలకు కూడా అనుమతించడం లేదనీ చెప్పారు.కొందరు తోటి విద్యార్థుల ముందు అవమానాలకు గురవుతూ పాఠశాలకు వెళ్లేందుకు జంకుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్ఏ-వన్(FA-1) పరీక్షలకు అనుమతించకుండా బ్లాక్ మెయిల్ పాల్పడడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.విద్యాశాఖ అధికారులు ఇప్పటి కైన ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే ముడుపుల మత్తును పక్కనపెట్టి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ