Thursday, 14 May 2026 12:57:20 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 19 April 2026 12:50 PM Views : 484

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు మరియు మీ సేవ కేంద్రాల మేనేజర్లతో గూగుల్ మీట్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు కల్పించినట్లుగానే ప్రతి రైతుకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడి) కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టబడినట్లు తెలిపారు. భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించబడుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డులను రైతుల ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడీ జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయడం ద్వారా ఎటువంటి కొత్త చట్టబద్ధ యాజమాన్య హక్కులు కల్పించబడవని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ రికార్డులలో ఉన్న భూ వివరాలను ప్రామాణికంగా తీసుకొని రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయడం జరుగుతుందని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం తదుపరి విడతల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. రాబోయే వర్షాకాలం సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయిన రైతు భరోసా, రుణమాఫీ, మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోలు, యూరియా మరియు ఇతర ఎరువుల పంపిణీకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. రైతులు తమ ఆధార్ కార్డు, భూ యాజమాన్య పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చని, లేక సమీప మీ సేవ కేంద్రాలను సంప్రదించి వెంటనే ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, మీసేవ కేంద్రాల వారు తమ పరిధిలోని ప్రతి రైతుకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :