Wednesday, 16 September 2026 10:08:19 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 24 October 2025 05:34 PM Views : 428

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల మేనేజ్‌మెంట్‌పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోగుల ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సక్రమ నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు. ఆసుపత్రుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వర్గీకరించి, ప్రత్యేక కంటైనర్లలో నిల్వ చేయడం, వాటిని గుర్తించిన సర్టిఫైడ్ ఏజెన్సీల ద్వారా సమయానికి సేకరించి శాస్త్రీయంగా పారవేయడం అనివార్యమని కలెక్టర్ సూచించారు. ప్రతి ఆసుపత్రిలో బయో వ్యర్థాల నిర్వహణ బాధ్యత వహించే నోడ్‌ల్ అధికారులు ఉండాలని, వారు ప్రతిరోజు రికార్డులను సక్రమంగా నమోదు చేసి, నియమిత సర్టిఫైడ్ ఏజెన్సీకి అందచేయాలని ఆదేశించారు. అసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిల్వ ప్రదేశాలు, సేకరణ విధానం, రవాణా వాహనాల శానిటేషన్ వంటి అంశాలపై పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని అన్నారు. పర్యావరణ కాలుష్యం నియంత్రణ మండలి (PCB) అధికారులు ఆసుపత్రులను తరచూ పరిశీలించి, బయో వ్యర్థాల నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం బయో వ్యర్థాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. సిబ్బందికి శిక్షణలు ఇవ్వడం, రక్షణ పరికరాలను ఉపయోగించడం, వ్యర్థాలను క్రమపద్ధతిలో నిర్వహించడం తప్పనిసరి అని కలెక్టర్ ఆదేశించారు. ఆర్ఎంపీలు లేదా ఇతర వ్యక్తులు బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో లేదా మున్సిపాలిటీ వ్యర్థాలతో కలిపినట్లయితే, కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై పెనాల్టీ విధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని, సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షణను ప్రయోగాత్మకంగా జిల్లా లో ఒక ప్రాంతంలో అమలు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ఆసుపత్రులు, ఆర్ఎంపీల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి, బయో వ్యర్థాల సురక్షిత నిర్వహణ, నియమావళి భద్రతా చర్యలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే, జిల్లావ్యాప్తంగా ఆసుపత్రులలో అవగాహన కల్పించేందుకు గోడపత్రికలను రూపొందించమని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన భద్రతా అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి, డిసిహెచ్ ఓ రవిబాబు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డీ.ఈ. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సుజాత, మణుగూరు మున్సిపల్ కమిషనర్, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :