Thursday, 17 September 2026 11:57:46 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పాల్వంచ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తాం : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 15 July 2026 05:08 PM Views : 128

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందస్తు ప్రణాళికతో ముందడుగు. మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తా. రూ.1.73 కోట్లతో 10 రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. పాల్వంచ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణంలో బుధవారం రూ.1.73 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపనల సభల్లో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 31, 33, 34, 36, 38, 42, 45 డివిజన్లలో ఈ నిధులతో మొత్తం 10 అభివృద్ధి, నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు వివరించారు. ప్రజలకు అత్యంత అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, అందులో భాగంగానే ఈ నిధులను మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు డ్రైన్ల నిర్మాణంతో పాటు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు సిమెంట్ రోడ్లను నిర్మిస్తామన్నారు. ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా ఈ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపక్షం నిలిచే ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని, పాల్వంచ పట్టణ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేషన్ కమిషనర్ కె సుజాత, తహసిల్దార్ దారా ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏ డి ఈ అబ్దుల్ రెహమాన్, డిప్యూటీ కమిషనర్ విజయానంద్, టౌన్ ఎస్సై తోట నాగరాజు, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, నామ కీర్తి, నూనావత్ శ్యామల, గొర్లె అన్నపూర్ణ, సింధు తపస్వి, సుగుణ, నరేష్, మధుచంద్, విజయలక్ష్మి, సీపీఐ నాయకులు శనగారపు శ్రీనివాసరావు, గౌతమి కృష్ణ, శేఖర్ బాబు, ys గిరి, నాగమణి, SA రెహమాన్, ఆలపాటి ప్రసాద్, కరీం, కాకటి రవీందర్, దినేష్, నరేష్, నవీన్, అంజాద్, రామాచారి, బట్టు హరి, చరప శ్రీను, లక్ష్మీ, రాజేశ్వరరావు, జిలానీ, భీమనాయక్, ఆదినారాయణ, అశోక్, వివిధ శాఖల డిఇలు, ఏఈలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :