తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్వంచ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం నాడు ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం అధికారులు, సిబ్బందితో స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ప్రాపర్టీ కేసులు, దొంగతనం కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి, చోరీకి గురైన ఆస్తి రికవరీ దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలను వినియోగించే వారిని గుర్తించి వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్టేషన్ పరిధిలోని సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను నిరంతరం సమీక్షిస్తూ సంబంధిత వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా కొనసాగించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సీసీటీఎన్ఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ పోలీసు సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్‌తో పాటు నాట్ గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.సైబర్ నేరాల ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్-112కు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్, సీఐ సతీష్, ఎస్సైలు నాగరాజు, సాయి కిషోర్ రెడ్డి, విజయ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ