తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 23 తెలుగు వెలుగు జూలూరుపాడు మండలం లోని జూలూరుపాడు, పాపకొల్లు, మాచినేనిపేట గ్రామపంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులను పరిశీలించి కొలతల ప్రకారం పని జరగాలని, పని కొరకు సరైన మార్కింగ్ మాస్టర్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఉపాధి కూలీల శ్రేయస్సును కాంక్షిస్తూ కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇచ్చిన పనిముట్లు కూలీలకు సక్రమముగా అందినదని లేనిది పరిశీలించి పనిముట్లను సక్రమంగా వినియోగించుకుని అందరూ కూలీలు 307/- పొందాలని తెలిపారు.పని ప్రదేశం వద్ద షేడ్ నీరు ప్రథమ చికిత్స పెట్టేంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అజయ్, ఎంపీ ఓ తులసీరామ్, ఏపీఓ రామారావు, ఈసీ సైదులు మరియు టెక్నికల్ అసిస్టెంట్ సంబంధిత గ్రామపంచాయతీల కార్యదర్శులు సర్పంచులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ