తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయిలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిపై అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదన కలెక్టర్ విద్యాచందన మరియు పంచాయతీ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అన్నారు. పంచాయతీ రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.50 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో తక్కువ సంఖ్యలో పెండింగ్ లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. అశ్వరావుపేట మున్సిపాలిటీగా రూపాంతరం చెందినందున మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి కావలసిన లాగిన్ లను త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట అదనపు లాగిన్ల ద్వారా అధికారులు సమన్వయంతో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిశీలన వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ