తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులకు చదువుతో పాటు కుంగ్ ఫు క్రీడ వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.ఆదివారం స్థానిక శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు శావలిన్ లోహాన్ కుంగ్ ఫు ఫౌండర్ బానోత్.సాగర్ మాస్టర్ శిక్షణలో శిక్షణ పొందిన బాల,బాలికలు,యువకులకు నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామేష్ అర్హత సాధించిన వారికి ఎల్లో,ఆరంజ్,గ్రీన్,బ్లూ,బ్రౌన్ మరియు బ్లాక్ బెల్ట్ లను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని కొన్ని చిన్న దేశాల పేర్లను సైతం గుర్తు పెట్టుకోవటానికి అక్కడి ప్రజలు క్రీడల్లో రాణించడమే కారణమన్నారు.తల్లిదండ్రులు పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లోను ప్రోత్సహించాలని కోరారు.ఏషియన్ గేమ్స్ లో కూడా వూషూ ద్వారా కుంగ్ ఫు క్రీడ వున్నందున క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయని తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి కలిగిన వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.అమర్ సింగ్,సీనియర్ మాస్టర్స్ ఎల్.ఆదినారాయణ,పి.కాశీ హుస్సేన్,ఎ.రాంబాబు,జి.రాంబాబు,యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మాలోత్ రాజా,కె.శ్రీనివాస్,ఎన్.వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ