Wednesday, 04 November 2026 11:12:04 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

యువతకు జాబ్ గ్యారెంటీతో ఉచిత స్కిల్ ట్రైనింగ్ – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 25 December 2025 05:58 PM Views : 496

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో LSC (Logistics Skill Council) మరియు Redington Foundation (COLTE) సహకారంతో జాబ్ గ్యారెంటీతో కూడిన ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందించి, శిక్షణ పూర్తైన అనంతరం 100 శాతం ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 24-12-2025 న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎంపిక డ్రైవ్‌లో 29 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా, మొత్తం 51 మంది యువతి, యువకులు శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. మరింత మందికి అవకాశం కల్పించేందుకు డిసెంబర్ 27, 2025 న ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మరో ప్రత్యేక ఎంపిక డ్రైవ్ నిర్వహించి అదనంగా 50 మంది యువతను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో వేర్‌హౌస్ స్టోర్ కీపర్, సప్లై చైన్ అసోసియేట్, ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వంటి కోర్సులు ఉండగా, 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉన్న యువతి, యువకులు అర్హులని తెలిపారు. శిక్షణ అనంతరం నెలకు 13,000 నుంచి 18,000 వరకు జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితమై స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ కలిగి ఉండటంతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కూడా ఉంటాయని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :