Wednesday, 16 September 2026 10:06:09 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అందించాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 22 October 2025 07:05 PM Views : 408

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భవిత కేంద్రాలు పిల్లల మానసిక, శారీరక వికాసానికి బలమైన వేదికలు కావాలి – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం కొత్తగూడెం బాబు క్యాంపు ప్రాంతంలో ఉన్న పీఎం శ్రీ ప్రభుత్వ హై స్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు భవిత కేంద్రాన్ని సందర్శించి పలు అంశాలను సమీక్షించారు.కలెక్టర్ మొదట పీఎం శ్రీ ప్రభుత్వ హై స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి, తరగతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానాలు, పాఠశాలలో లభ్యమవుతున్న సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల వినియోగం, స్మార్ట్ బోర్డుల ద్వారా పాఠ్యాంశ బోధన విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న విషయాలు, తమ భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. పదవ తరగతి గదిలోకి వెళ్లి ఆ సమయంలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీవీలను ఉపయోగిస్తున్నారా వీటి ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరు ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఖాన్ అకాడమీలో విద్యార్థులను రిజిస్టర్ చేశారని ప్రధానోపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – పీఎం శ్రీ పథకం కింద ప్రతి పాఠశాలను ఉత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని,ఈ పాఠశాలలు భవిష్యత్తులో దేశానికి మార్గదర్శకులుగా నిలిచే విద్యార్థులను తయారు చేయాలి అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించేలా బోధన విధానాలను అవలంబించాలి, అని సూచించారు.అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మైక్రో లెర్నింగ్ కార్యక్రమాలు, సైన్స్ ప్రాజెక్టులు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలల్లో పోషకాహార మెనూ, మిడ్‌డే మీల్ నాణ్యత, పిల్లల ఆరోగ్య రికార్డులు కూడా పరిశీలించారు.అనంతరం కలెక్టర్ బాబు క్యాంపులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, ఆటలు, శ్రద్ధల గురించి తెలుసుకున్నారు. చిన్న పిల్లలలో పాఠశాలపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు సృజనాత్మక పద్ధతులు ఉపయోగించాలని సూచించారు. ప్రాథమిక స్థాయి విద్యనే పిల్లల భవిష్యత్తుకు పునాది అన్నారు. అందుకే ఈ దశలో విలువాధారిత విద్య అత్యంత ముఖ్యం అని ఆయన తెలిపారు.తరువాత ఆయన భవిత కేంద్రం ను సందర్శించి, అక్కడ జరుగుతున్న పిల్లల సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలు, తల్లిదండ్రుల అవగాహన సమావేశాలు, శిశు సంరక్షణ పథకాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, బరువు కొలతలు, పోషకాహార పంపిణీ తదితర అంశాలను సమీక్షించారు. భవిత కేంద్రం ద్వారా తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణ, పిల్లలలో మానసిక-శారీరక వికాసం సాధించడానికి ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయురాలు నీరజ, బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :