తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగభూపాలెం చెరువుకు త్వరలో గోదావరి జలాలు. సీతారామ ప్రాజెక్టు నీళ్లతో జిల్లా రైతాంగానికి సాగునీరు.ప్రతిపాదిత కాల్వల నిర్మాణానికి ఆమోదం లభించింది.చెరువుకట్ట పటిష్టతకు రూ.5 కోట్లు మంజూరు.టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలో పనులు ప్రారంభం.జిల్లా రైతాంగ క'న్నీటి' కస్టాలు తీర్చే భాధ్యతను స్వీకరించా.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.సింగభూపాలెం చెరువుకు అతిత్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రానున్నాయని, అందుకు సంబందించిన ప్రతిపాదనలు సిద్దమయ్యాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సుజాతనగర్ మండల పరిధిలోని సింగభూపాలెం చెరువును శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు జలాలు స్థానిక రైతాంగానికి అందకుండా గతంలో అన్యాయం జరిగిందన్నారు. కొత్తగూడెంతో పాటు భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల సాగు అవసరాలకు ఈ నీటిని మళ్లించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపి గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. జూలూరుపాడు మండలం వినోభానగర్ మీదుగా మండలంలోని చెరువులన్నింటినీ నింపుతూ, అక్కడి నుంచి పెద్దవాగు ద్వారా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువుకు గోదావరి జలాలు చేరేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని, వీటికి త్వరలోనే పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేయిస్తామని చెప్పారు. ఇది సుజాతనగర్, పరిసర గ్రామాల రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. అలాగే కుంగుబాటుకు గురైన సింగభూపాలెం చెరువుకట్ట పునర్నిర్మాణానికి, రక్షణ చర్యలకు రూ.5 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు వేగవంతం చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని రైతాంగం సాగునీటికోసం పడుతున్న కష్టాలను గుర్తించి, జిల్లా రైతాంగానికి ఉపయోగపడకుండా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి ప్రభుత్వంతో కోట్లాడి సాగునీటిని సాదించుకోబోతున్నామని కూనంనేని స్పష్టం చేశారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, అధికారులు సుజాత, కె మహేశ్వరరావు, కె చంద్రశేఖర్, శ్రావణి, స్థానిక నాయకులు సలిగంటి శ్రీనివాస్, భూక్యా దస్రు, జక్కుల రాములు, తాళ్ల వెంకటేశ్వరరావు, ధర్మయ్య, పొదిలీ శ్రీనివాస్, మహేశ్వరరావు, గోపి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ