Thursday, 17 September 2026 02:48:05 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మణుగూరులో జిల్లా కలెక్టర్ అంకిత్ సుడిగాలి పర్యటన – ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు..

Date : 05 March 2026 05:42 PM Views : 317

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట – నాణ్యమైన భోజనం అందించడం అందరి బాధ్యత విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించము : జిల్లా కలెక్టర్ అంకిత్. జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం మణుగూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పలు ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల, గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని వార్డులు, ఔషధ నిల్వ గది, మందుల సరఫరా విధానం, ఔట్‌పేషంట్ విభాగం, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, బోధన విధానం గురించి తెలుసుకున్నారు. కిచెన్ షెడ్‌లో ఆహార తయారీ విధానాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు మరియు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ఫలితాల వివరాలు తెలుసుకొని ఈ ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో పాటు పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, వారికి నాణ్యమైన ఆహారం అందించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరి యూనిట్ ద్వారా సరఫరా అవుతున్న చిక్కీలను స్వయంగా రుచి చూసి వాటి నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనాన్ని కూడా రుచి చూసి ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన విధానం మరియు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి వారికి పాఠాలు ఎలా బోధిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే మంచి విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం మరియు ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, పోషకాహారం పంపిణీ విధానం, పిల్లల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని వంటగది, స్టోర్ రూమ్, త్రాగునీటి సదుపాయం, పరిశుభ్రత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, గుడ్లు మరియు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి గుడ్ల పరిమాణాన్ని పరిశీలించారు. పిల్లలకు అందించే పోషకాహారం మెనూ ప్రకారం సమయానికి అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు, ఆటపాటల ద్వారా బోధన విధానాన్ని కూడా పరిశీలించారు. పిల్లలకు పోషకాహారం నాణ్యంగా, పరిశుభ్రంగా అందేలా, కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా, ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, వైద్యులు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఉపాధ్యాయులు విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :