తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ//రూరల్: దంతలబోరు గ్రామం వద్ద కిన్నెరసాని, ముర్రేడు వాగు మధ్య వరద వల్ల పశువుల కాపరులు చెక్కుకున్నారు. విషయం తెలుసుకున్న *కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు* హుటా హుటిన దంతలబోరు గ్రామాన్ని చేరుకొని కిన్నెరసాని వరదలో చిక్కుకున్న వారికి అందుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రిస్క్యూ పనులు మొదలుపెట్టగా, *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్* తో కలసి ఎన్ డి ఆర్ ఎఫ్, ఇతర సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పశువుల కాపరులందర్నీ సురక్షితంగా బయటికి తీసుకురాటానికి అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, ఇప్పటివరకు ఆరుగురు అడ్డుకు చేర్చడం జరిగిందని ఎంఎల్ఏ కూనంనేని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ