Friday, 18 September 2026 06:13:48 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరనుంది..

Date : 02 September 2025 08:17 PM Views : 785

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన ప్రాంతమైన బెండలపాడు చారిత్రక ఘట్టం.. పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం బెడాలపాడు గ్రామంలో జరగబోయే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను గృహనిర్మాణ శాఖ ఎండి వి. పి. గౌతమ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యతో కలిసి మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన బెండలపాడు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం ఒక చారిత్రక ఘట్టం. ఇది గ్రామ ప్రజలకు సంతోషకరమైన మరియు గుర్తుండిపోయే రోజు అవుతుంది. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలి అని సూచించారు. మంత్రి అధికారులు గృహప్రవేశ వేడుకలను పండుగ వాతావరణంలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం, గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి లోటు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మాట్లాడుతూ మంత్రి తెలిపారు, మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గృహనిర్మాణ శాఖను బలోపేతం చేస్తూ, పేదవారికి న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో ఇళ్లను మంజూరు చేస్తున్నాం. లబ్ధిదారుల ఎంపిక నుండి వారి ఖాతాల్లో నిధుల జమ వరకు మొత్తం ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎక్కడైనా అవకతవకలు జరిగినా వాటిని వెంటనే గుర్తించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు కొందరిని సస్పెండ్ చేయడం, కేసులను ఏసీబీకి అప్పగించడం కూడా జరిగింది అని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వానికి ఓటు వేసిన వారికే కాకుండా, రాజకీయాలు, కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకం వల్ల జిల్లాలోనే సుమారు 21,500 కుటుంబాల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గృహప్రవేశాల సందర్భంగా లబ్ధిదారులను ప్రత్యక్షంగా ఉద్దేశించి మాట్లాడి, వారి సంతోషంలో పాలుపంచుకుంటారు అని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను నిర్వీర్యం చేసి, పేదవారి కలలను దెబ్బతీసింది. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహనిర్మాణ శాఖను తిరిగి బలోపేతం చేసి, లక్షలాది పేదలకు గృహాల కలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నాం" అన్నారు. ఈ మహత్తర గృహప్రవేశ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంచార్జ్ మంత్రి వాకాటి శ్రీహరి, ఇతర సహచర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ పరిశీలనలో టీజీ ఐడిసి చైర్మన్ మువ్వ విజయ్ బాబు,ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :