తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఉన్నటువంటి రెండు పెట్రోల్ బంకుల్లో ఇందనం లేక మూతపడడంతో వాహనదారులు, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుండి వెళ్లే వాహనదారులు, బంకుల్లో పెట్రోల్ దొరుకుతుందని గ్రామాల నుండి మండల కేంద్రంలో వచ్చేవారు తీరా బంకు దగ్గరికి వెళ్లేసరికి పెట్రోల్, డీజిల్ లేదంటూ సిబ్బంది సమాధానం చెబుతూ ఉండటంతో తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. బంకుల్లో ఎదుట కనీసం నో స్టాక్ బోర్డు లేకపోవడం, పెట్రోల్ లేదని సమాచారం తెలియచేయకపోవడం వల్ల వాహనదారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై తాసీల్దార్ జగదీష్ ప్రసాద్ ను వివరణ కోరగా బంకుల్లో స్టాక్ లేని విషయం తన దృష్టికి రాలేదని, సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారూ .
Admin
తెలుగు వెలుగు టీవీ