Thursday, 17 September 2026 04:04:18 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

అధిక ఫీజులు వసూలుకు పాల్పడుతున్న పాల్వంచ నారాయణ విద్యాసంస్థలను బ్యాన్ చేయాలి... ఏఐఎస్ఎఫ్

Date : 24 June 2025 04:58 PM Views : 596

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ: అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాలను రద్దు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి SK ఫహీమ్ దాదా డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ స్టేషనరీ పేరుతో బుక్ స్టాల్ ఏర్పాటు చేసుకొని లక్షలాది రూపాయలు విద్యార్థులు తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్న ఈ విషయంపై మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ఎదుట బేటాయించి ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘం నాయకులు చారువాణి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి కి సమాచారం అందించారు. స్థానిక ఎంఈఓ శ్రీరామ్మూర్తి పాఠశాల వద్దకు చేరుకొని స్టేషనరీ పాఠశాల యూనిఫామ్ లు ఉంచిన రూమ్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి SK ఫహీమ్ దాదా మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పేద విద్యార్థి తల్లిదండ్రులను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆసరాగా చేసుకొని కాసులు వసూలుకు పాల్పడుతున్న విద్య హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలినీ, విద్య హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు పేదల వర్గాల విద్యార్థులకు 25% పీజి రాయితీ ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఈ నిబంధనలను నారాయణ పాఠశాల నిర్వాహకులు ఏ కోశానా అమలు చేయడం లేదన్నారు. (జీవో నెంబర్ 42)2010 ప్రకారం డొనేషన్లు క్యాప్టేషన్ ఫీజులు వసూలు చేయకూడదని, ఆట స్థలం తప్పనిసరిగా మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు మీటర్లు ఉండాలని నిబంధనలు ఉన్నా ఆ నిబంధన తుంగలో తొక్కి తముష్టానుసారంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ మాత్రం నిమ్మకు నిరత్తినట్టుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని, విద్యాశాఖ అధికారుల అనుమతులతోనే అదనపు ఫీజులు వసూలు చేస్తున్నామని బహిరంగంగా యాజమాన్యం చెప్పడం వెనక ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై దాడులు నిర్వహించి పర్మిషన్ లేనటువంటి విద్యాసంస్థలను తక్షణమే సీజ్ చెయ్యాలని లేనిపక్షంలో దాడులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వర్క అజిత్, జిల్లా ఉపాధ్యక్షులు గుండాల సుజన, ఇనపల్లి పవన్ సాయి, నాయకులు అక్కినపల్లి నాగేంద్రబాబు, వినయ్, వంశీ, మహేష్, కళ్యాణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :