తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న నియోజకవర్గాల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం లలో భాగంగా ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజు అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని పార్టీ నాయకులు నిర్వహించనున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు రానున్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సమన్వయమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన విభాగం జనసేన పార్టీ నాయకులు గరికె రాంబాబు మాట్లాడుతూ, జిల్లా నలుమూలల నుంచి భారీ బైక్ ర్యాలీతో జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఐదు మండలాల జనసేన పార్టీ నాయకులు ఎస్.కె అబ్దుల్ రెహమాన్, బానోత్ వినోద్ కుమార్, తాటికొండ ప్రవీణ్, పసుపులేటి కిషోర్, తాటికొండ వేణు మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, యువత, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జనసేన శక్తిని చాటాలని కోరారు. ఈ కార్యక్రమం పార్టీ బలోపేతానికి దోహదపడే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ