Saturday, 19 September 2026 04:20:13 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు.

Date : 06 June 2026 07:30 PM Views : 139

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మీసేవ ద్వారా అందిస్తున్న వివిధ ధృవపత్రాల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ విధానాలపై ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు అవగాహన కల్పించారు. చండ్రుగొండ తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్, అన్నపురెడ్డిపల్లి తహసీల్దార్ స్వర్ణ ఆధ్వర్యంలో ఆయా మండలాల జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులతో సమావేశం నిర్వహించి మీసేవ దరఖాస్తుల పరిశీలన, ధృవపత్రాల జారీ ప్రక్రియపై సమీక్షించారు.ఈ సందర్భంగా సైదేశ్వరరావు మాట్లాడుతూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునే ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఈబీసీ, ఓబీసీ తదితర సేవల దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు అప్లోడ్ చేసిన పత్రాలను మాత్రమే జీపీఓలు, ఆర్‌ఐలు పరిశీలించి అర్హత మేరకు ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. భౌతిక పత్రాలను స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన GPOs & MRIs Verification Mobile Application వినియోగంపై అధికారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించవచ్చని వివరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను మాత్రమే వసూలు చేయాలని, అదనపు రుసుములు వసూలు చేయరాదని తెలిపారు. దరఖాస్తుల నమోదు సమయంలో వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, డేటా ఎంట్రీలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ధృవపత్రాల జారీ అనంతరం సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు.మీసేవ సేవలకు సంబంధించిన సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైనప్పుడు మండల స్థాయి జీపీఓ, ఆర్‌ఐ లేదా తహసీల్దార్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :