తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న లఘు చిత్రం *"వనజీవి రామయ్య"షూటింగ్ హైదరాబాద్ లోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో జరిగింది. ఈ చిత్రంలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ వనజీవి రామయ్య పాత్రలో కథానాయకుడిగా నటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ చిత్రంలో తెలంగాణకు చెందిన ప్రకృతి ప్రేమికుడు వాక్ ఫర్ ట్రీస్ విశ్వామిత్ర చౌహాన్ పై ప్రత్యేక పాత్ర ఉండటం విశేషం. షూటింగ్ సందర్భంగా చార్మినార్ సర్కిల్ సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నతనం నుండి ప్రతిరోజూ మొక్కలు నాటుతూ 1568 రోజుల్లో 1568 మొక్కలు నాటుతున్న విశ్వామిత్ర చౌహాన్ ను సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ IFS ప్రత్యేకంగా అభినందించారు. వనజీవి రామయ్య స్ఫూర్తితోనే తాను మొక్కలు నాటుతున్నానని, ఆయన జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న చిత్రంలో నటించడం తనపై ప్రత్యేక పాత్ర ఉండటం తనకు గర్వకారణమని విశ్వామిత్ర ఈ సందర్భంగా తెలిపాడు. ఈ లఘు చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ