Wednesday, 16 September 2026 05:52:41 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్న కోర్సా రమేష్.

Date : 12 December 2025 07:51 PM Views : 634

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అనంతారం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోర్సా రమేష్ నామినేషన్ వేయడం జరిగింది. కోర్సా రమేష్ మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ.. గ్రామాభివృద్ధి ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవ కొరకు కృషి చేస్తానని, అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తానని కుల మత జాతి విభేదాలు లేకుండా అందరిని సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూస్తాను.ఆత్మగౌరవంతో సమాజ సేవకు ముందుకు వచ్చాను మీరందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే అనేక అభివృద్ధి పనులు చేయిస్తాను, రాజకీయంగా, ఆర్థికంగా,సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధమైన సేవలను అందించడంలో ముందు ఉంటానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గ్రామస్తులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మండలంలో ఒక ఊరు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిరుపేదలందరికీ ఇల్లు అందజేయాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి మండలంలో 24 పంచాయతీల రాజకీయ నాయకులు పోటీపడ్డారు. ఆ తరుణంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉసికల వెంకటేశ్వర్లు సహాయంతో పైలెట్ గ్రామ పంచాయతీగా తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశాం దాని ఫలితమే అనంతారం గ్రామపంచాయతీ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైనది. దాని ఫలితంగా గ్రామంలో 85 మంది నిరుపేదలకు ఇల్లు వచ్చాయి గతంలో ఎన్నడూ లేని విధంగా 50 మంది కుటుంబీకులకు తెల్ల రేషన్ కార్డులు తీసుకువచ్చామ్, ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్స్ లో ఖర్చుపెట్టిన డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 20 కుటుంబాలకు చెక్కుల అందేలా చేసాం కనుక మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలంటూ గడపగడపకు తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :