తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 3 తెలుగు వెలుగు) కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు,కార్మిక వ్యతిరేక నల్లచట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 5 వ తేదీన జాతీయ సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, అఖిల భారత రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ ధర్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు రెడ్డెబోయిన గోవింద్ లు మాట్లాడుతూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 44 చట్టాలను నాలుగు చట్టాలుగా నాలుగు లేబర్ కోడలుగా క్రోడీకరించి అమలు చేస్తుందని, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతుందని ఈ విధానాలను నిరసిస్తూ జాతీయ కమిటీ ఈనెల 5వ తేదీన జూలూరుపాడు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయనున్నామని దీనికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.. వ్యవసాయ ఉపాధి కార్మికులకు అసంఘటిత రంగ కార్మికులు పేదలకు ఈ బడ్జెట్ లోనే అన్యాయం జరిగింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు కేటాయించకపోవడం బాధాకర మన్నారు ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టి యు సి జిల్లా సహాయ కార్యదర్శి రాయల సుధాకర్ గడిదేశి కనక రత్నం ఏఐటీయూసీ మండల కార్యదర్శి sk చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ