తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 10 , జూలూరుపాడు మండల వ్యాప్తంగా సుమారు 50 విత్తన, పురుగు మందుల షాపులు ఉన్నాయి. వీటిలో నాలుగు ఐదు షాపులు మినహాయిస్తే మిగతా షాపులలో పనిచేస్తున్న గుమ్మస్తాలా నే షాపు యజమానులు వివిధ పెట్ సైట్స్ కంపెనీలలో చేర్పించి ఫీల్డ్ లోకి వెళ్తే కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ గా గ్రామాలలో రైతులతో సమావేశాలు పెట్టి ఫలానా మందులు పలానా షాపులో దొరుకుతాయని మేము కంపెనీ నుంచి వచ్చామని రైతులకు మాయ మాటలు చెప్పి షాపుల అడ్రస్లు ఇస్తారు. తీరా చూస్తే వాళ్లు అదే షాపులో గుమ్మస్తాలుగా ఉంటారు ఇదంతా షాపు యజమానులు కొత్త రకమైన వ్యాపారం. కంపెనీ వాళ్లు ఇచ్చే లక్ష్యాలను పూర్తి చేసేందుకు గాను కంపెనీ ఎంప్లాయ్ గా ఉన్న వీళ్లు రైతులకు ఇష్టమున్న,లేకున్నా మాయమాటలతో కంపెనీ ద్వారా జీతాలు రావని వివిధ నాసిరకపు వేల రూపాయల మందులను అంటగడతారు. ఈ ప్రక్రియలో అధిక లాభాలతో షాపు యజమానులు, అధిక అప్పులతో రైతులు ఇదే రెండు కొలువుల మాయాజాలం
Admin
తెలుగు వెలుగు టీవీ