Wednesday, 16 September 2026 10:39:46 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలి. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా

Date : 11 October 2025 07:22 PM Views : 445

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాకతీయ విశ్వవిద్యాలయం పెంచిన ఫీజులను ఉపసహరించుకోవాలి. విద్యార్థులపై భారం మోపితే ప్రభుత్వంపై ఆందోళన తప్పదు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వంపై ఆందోళన తప్పదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక శేషగిరి భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఫహీమ్ దాదా పాల్గొని మాట్లాడుతూ. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి వరంగల్,ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ కోర్సులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలు పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది అన్నారు. ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో 80 ఉండగా ఇప్పుడు 1200 రూపాయలకు పెంచారు. రికగ్నేషన్ ఫీజు గతంలో 400 ఉండగా ఇప్పుడు 800 కు ఐయుడిఎఫ్, ఫీజు గతంలో 60 ఉండగా ఇప్పుడు 300 కు ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఫీజు గతంలో 50 ఉండగా ఇప్పుడు 200 కు పెంపుదల చేసి విద్యార్థులపై తీవ్ర భారాన్ని మోపారన్నారు. ఒక్క పరీక్ష ఫీజు మాత్రమే 750 గతంలో మాదిరిగానే యధావిదంగా కొనసాగిస్తున్నారని.గతంలో ఒక్కొక్క విద్యార్థి ఆయా ఆయా అన్ని రకాల ఫీజుల క్రింద 1340 చెల్లించేవారనిఇప్పుడు ఏకంగా ఆ ఫీజులు అన్ని కలిపి 3,250 కి పెంపుదల చేయడంలో ప్రభుత్వం ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.గతం కంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై 1910 రూపాయలు ఫీజు భారం పడుతుంది. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పేద విద్యార్థులు ఏమాత్రం కట్టలేనటువంటి ఫీజుల భారాన్ని విద్యార్థులపై ప్రభుత్వం మోపడం సరికాదని తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఫీజుల భారం తగ్గించకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, చంద్రగిరి ప్రసాద్, రసూల్ పాషా, కొచ్చెర్ల రాకేష్, ఎస్ కే, జావీద్, రణధీర్, కోయడా రవి, బోడ చింటూ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :