తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాలలో అన్ని గనులు మేనేజర్లకు డిపార్ట్మెంట్స్ హెచ్ ఓ డి లకు మెమొరండాలు కాపుకృష్ణ టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది వారి ద్వారా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మెమో రాండం పంపాలని కోరడం జరిగింది. విషయం: మెడికల్ బోర్డు తక్షణమే నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. కొత్త గనులను సాధిస్తూ, వాటిలో సింగరేణి ఉద్యోగులతో నడిపిస్తూ సంక్షేమ చర్యలు అమలు చేయాలని విజ్ఞప్తి.... . . మా మనవి ఏమనగా! సింగరేణి బొగ్గు గని కార్మికులు దుమ్ము ధూళిలో పనిచేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అనారోగ్య కారణాలుతో (రోగాలతో) డ్యూటీలకు హాజరు కాకపోవడం వలన జీతం రాక, అప్పుల పాలవుతున్నారు. దేశంలోని ఇతర పరిశ్రమలకు భిన్నంగా బొగ్గు గని కార్మికులు పనిచేస్తారు. పని స్థలాలు కాలుష్యం, ప్రమాదాలతో కూడుకుని ఉన్న ప్రతి కార్మికులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మరియు కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్రపూరితంగా వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసి, సింగరేణి కార్మిక కుటుంబాలకు తీరని ద్రోహం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, గౌరవ కెసిఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సాహసోపేతంగా తిరిగి కారుణ్య నియామకాల పేరిట కార్మికుడి వారసులకు ఉద్యోగాలను పునరుద్ధరించారు. గత అసెంబ్లీ, సింగరేణి గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా కార్మికులను మోసగిస్తున్నారు. సింగరేణి కార్మికులకు ప్రతి నెలలో రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి, అధిక సంఖ్యలో కారుణ్య ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆచరణలో గడిచిన 15 నెలలుగా ఒక్క మెడికల్ బోర్డు నిర్వహించలేదు. వేలాది మంది కార్మికులు తమ వారసులకు ఉద్యోగాల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కారుణ్య నియామకాలలో అవినీతి జరిగిందని అసెంబ్లీలో ప్రకటించారు. ఇది అత్యంత కుట్రపూరితమైన చర్య. విజిలెన్స్ విచారణ పేరిట కార్మికులను వేధింపులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఘోరంగా విఫలమయ్యాయి. సింగరేణి సంస్థ పరిరక్షణకు, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తున్నది. డిమాండ్లు:- *ప్రతినెల రెండు మెడికల్ బోర్డులను నిరంతరాయంగా నిర్వహించాలి. *ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణమే నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. * విజిలెన్స్ మరియు మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి. *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 54 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే రాబట్టాలి. *కార్మికులు పెర్క్స్ పైన చెల్లిస్తున్న ఇన్కమ్ టాక్స్ డబ్బులను యాజమాన్యం తిరిగి కార్మికులకు చెల్లించాలి. *గైర్హాజర్ పేరిట కార్మికులను డిస్మిస్ చేయరాదు. కొందరికి జారి చేసిన డిస్మిస్ ఉత్తర్వులు ఉపసంహరించుకొని,కార్మికులను విధులకు అనుమతించాలి. *కొత్త బొగ్గు గనుల కేటాయింపు కు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరపాలి. ఉన్న గనులను సింగరేణి కార్మికులతో నడిపించాలి. ఈయొక్క కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ మెంబర్లు కాగితపు విజయ్ కుమార్, బూర్గుల రవికుమార్, ఎంటెక్ మహేందర్, కంచర్ల శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీలు బండారి రాజ్ కుమార్,నమిల్ల వెంకటేశ్వర్లు, రఘువీర్, ఆంజనేయులు, తిరుపతి,సూరజ్, సూర్యనారాయణ, జైపాల్, కుమార్, శ్రీకాంత్, చంద్రశేఖర్, రాజు,రాంబాబు,సంతోష్, రవి వర్మ, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ