Friday, 18 September 2026 03:08:28 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 11 April 2026 03:39 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమన్వయంతోనే జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డులు – వైద్య శాఖకు కలెక్టర్ అభినందనలు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో ఒక భాగంగా జిల్లా వైద్య విధానం పరిషత్ ఆసుపత్రుల సిబ్బందికి ప్రశంస పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం పాల్వంచ పెద్దమ్మ గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై, వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసి, వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంగా ఉన్న జిల్లాలో నాణ్యమైన వైద్య సేవలను అందించడం ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, జిల్లా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో వైద్య శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు . గతంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి, కమ్యూనికేషన్ సదుపాయాలు లేకపోవడం వల్ల వైద్య సేవలను సమర్థవంతంగా అందించడంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో చర్ల, గుండాల వంటి దూర ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలను అందించడం సాధ్యమైందని తెలిపారు. టెలీమెడిసిన్, డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ వైద్య సేవల ద్వారా ప్రజలకు సమయానికి చికిత్స అందించడం సాధ్యమవుతోందని చెప్పారు. ఈ విజయానికి ఆశా కార్యకర్తల నుండి ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్యులు, జిల్లా స్థాయి అధికారులు వరకు అందరి సమన్వయం ముఖ్య కారణమని కలెక్టర్ అన్నారు . ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం వల్లనే జిల్లాకు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అవార్డులు లభించాయని తెలిపారు. ఇది జిల్లాకు గర్వకారణమని అన్నారు. జిల్లా వైద్య శాఖ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి, రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయితో పాటు దేశ స్థాయిలో కూడా అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, ప్రతి పల్లె, ప్రతి గిరిజన ప్రాంతానికి ఆరోగ్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు . ప్రస్తుత సంవత్సరంలో సాధించిన విజయాలను కొనసాగిస్తూ, వచ్చే సంవత్సరం కూడా మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు జిల్లాకు తీసుకురావాలని వైద్య సిబ్బందిని ప్రోత్సహించారు. సేవా భావంతో పనిచేసే వైద్య సిబ్బంది వల్లే ప్రజల నమ్మకం పెరుగుతుందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ రవిబాబు, తాసిల్దార్ దారా ప్రసాద్, ఆసుపత్రుల సూపర్డెంట్లు, వైద్యులు, నర్సులు, సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :