తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : లక్ష్మిదేవిపల్లి మండలంలో రిటైర్డ్ ఎస్ఐ కాజా ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కొత్తగూడెం త్రీటౌన్‌లో పని చేసిన ఎస్ఐ ఖాజా మొహినుద్దీన్ గతేడాది ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి ఎదురుగడ్డలో కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇటీవల తన భార్య అనారోగ్యంగా ఉండటం, పిల్లలు ఇంకా సెటిల్ కాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నాడు. మనస్తాపంతో ఆదివారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ