తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టు హేయమైన చర్య అని, జర్నలిస్టుల అక్రమ అరెస్టును,ఎన్టీవీ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి సోదాలు చేయడాన్ని ఖండిస్తున్నామని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందని అంతేకాని ప్రశ్నించే వారిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్దరాత్రి అరెస్టులు చేయడం,జర్నలిస్టులను వారి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం జర్నలిస్టుల ఇళ్ళ తలుపులు బద్దలు కొట్టడమేంటని ప్రశ్నించారు.ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏడవ హామీ ప్రజాస్వామ్యం అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేకుండా పాలన కొనసాగుతోందని విమర్శించారు.ఎటువంటి నోటీసులు,సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి సోదాలు నిర్వహించడం లాంటి దుర్మార్గపు చర్యలను మానుకోవాలన్నారు.మీడియా సంస్థలను భయపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుందని,సిట్ వేసిన ప్రభుత్వం సిట్ విచారణ జరగకముందే అరెస్టు చేసిన ముగ్గురు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ