Thursday, 17 September 2026 11:58:40 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 28 November 2025 03:38 PM Views : 290

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిసెంబర్ 2న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ విశ్వవిద్యాలయంలో ని అన్ని విభాగాలను సంబంధిత శాఖల ఇంజనీరింగ్, రోడ్లు-భవనాలు, విద్యుత్, పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పనుల పురోగతి, భద్రతా చర్యలు, నిర్వహణ వంటి అంశాలపై అధికారుల నుండి వివరణలు కోరారు. శిలాఫలకం ఏర్పాటు, ఆవరణ అభివృద్ధి, అంతర్గత రోడ్ల మరమ్మత్తులు, సందర్శకుల కోసం ఏర్పాటు చేయాల్సిన మార్గదర్శక బోర్డులు, పార్కింగ్ స్థలాలు, స్టేజీ నిర్మాణం, విద్యుత్ సౌకర్యాల తనిఖీ వంటి అంశాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, లోటుపాట్లు ఏవైనా ఉన్న వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రాధాన్యత కలిగినది అని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. విశ్వవిద్యాలయం సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటడం, ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రి పర్యటన నాటికి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పర్యటన రూట్‌మ్యాప్ తుది రూపు, ట్రాఫిక్ సర్దుబాట్లు, అగ్నిమాపక చర్యలు, వైద్య బృందాల నియామకం, వీఐపి ప్రోటోకాల్ అమలు, వంటి అంశాలపై కూడా కలెక్టర్ ప్రత్యేక సూచనలు చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :