తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహాత్ముడి ఆశయాలను సాధిద్దాం. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ యువత మహాత్ముడు ఆశయాలను సాధించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాసులు యువతకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక హై స్కూల్ లో గల మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. యువత చెడు మార్గాలను విస్మరించి గాంధీజీ సూచించిన అహింసాహిత, శాంతి, సత్యాగ్రహ పద్ధతుల ద్వారా ఆయన బాటలో ఆయన ఆశలను సాధించడం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వున్నం దాస్ గడ్డ 1,శాఖ 2 కార్యదర్శులు ఎస్కే జలీల్, తోగరు నరేంద్ర కుమార్, సీనియర్ నాయకులు బానోతు చందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ