Monday, 02 November 2026 05:31:26 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా 106వ ఆవిర్భావ వేడుకలు

Date : 31 October 2026 01:49 PM Views : 67

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రామిక వర్గ పోరాటాలకు ఏఐటీయూసీ జెండానే దిక్చూచి ఎర్రజెండా నీడలోనే శ్రామికులకు రక్షణ కార్పొరేట్ కొమ్ముకాసే విధానాలు తిప్పికొట్టాలి చారిత్రక హక్కుల సాధన, పరిరక్షణకోసం ఐక్యంగా ఉద్యమిద్దాం ఐక్య పోరాటాలతోనే కార్మిక లోకానికి మనుగడ : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా శ్రామిక వర్గ పోరాటాలకు ఏఐటీయూసీ జెండానే దిక్చూచి అని, శ్రామిక పక్షాన నిలబడి ఎరుపెక్కించిన ఆ ఎర్రజెండా నీడలోనే కార్మికులకు అసలైన రక్షణ లభిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.కె. సాబీర్ పాషా అన్నారు. శనివారం పట్టణంలోని పలు కార్మిక కేంద్రాలు, హమాలీ అడ్డాల్లో ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘ పతాకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఒక శతాబ్దానికి పైగా దేశ ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామికుల సంక్షేమాన్ని కేంద్ర పాలకులు పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఎన్నో త్యాగాలు, సమ్మెలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడమేనని దుయ్యబట్టారు. సంఘటిత, అసంఘటిత రంగాలనే తేడా లేకుండా కోట్లాది మంది హమాలీలు, ఆటో కార్మికులు, ఇతర శ్రామికుల జీవితాలను పాలకుల విధానాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు శక్తులకు కారుచౌకగా కట్టబెట్టే కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత శ్రామిక లోకంపై ఉందన్నారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధనకు ఏఐటీయూసీ ఎల్లప్పుడూ అండగా ఉండి రాజీలేని ఉద్యమాలను నడుపుతుందని స్పష్టం చేశారు. కార్మిక వర్గ ఐక్యతను చాటిచెబుతూ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్, గెడ్డాడు నగేష్, వంగ వెంకట్, గనగళ్ల వీరాస్వామి, రమణమూర్తి, వాసిరెడ్డి మురళి, భూక్యా శ్రీనివాస్, మండల రాజేశ్వరరావు, లక్ష్మీనారాయణ, మాతంగి లింగయ్య, ఆరెల్లి కృష్ణ, అబ్బులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :