Saturday, 19 September 2026 09:53:46 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

' రైతునేస్తం' 100వ ఎపిసోడ్ విజయవంతం

Date : 28 July 2026 03:35 PM Views : 114

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ వ్యూహాలపై నిపుణుల సూచనలు పూసగూడెం రైతు వేదికలో రైతులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్ అత్యధికసార్లు కార్యక్రమాన్ని వీక్షించిన రైతులకు జిల్లా స్థాయిలో సత్కారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'రైతునేస్తం' కార్యక్రమం మంగళవారం 100వ ఎపిసోడ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, సుమారు మూడు లక్షల మంది రైతులు వర్చువల్‌గా పాల్గొని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను తెలుసుకున్నారు. 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్రమోహన్, ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ వ్యూహాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ పద్ధతులు, చీడపీడల సమగ్ర యాజమాన్యం, పోషక నిర్వహణ, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సమగ్ర అవగాహన కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం పూసగూడెం రైతు వేదికనుండి జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులతో కలిసి వర్చువల్ ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న శాస్త్రీయ సలహాలను రైతులు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. నీటి వినియోగంలో పొదుపు పాటిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా నిర్వహిస్తున్న 'రైతునేస్తం' కార్యక్రమం రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో సమర్థవంతమైన వేదికగా నిలిచిందని కలెక్టర్ అన్నారు . పంటల సాగుకు సంబంధించిన సందేహాలకు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు పొందడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంలో ఈ కార్యక్రమం విశేషంగా ఉపయోగపడుతోందన్నారు. 'రైతునేస్తం' కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అత్యధికసార్లు వీక్షించిన ముగ్గురు రైతులను, కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరిచిన మరో ఇద్దరు ఏ ఈ వోలను జిల్లా కలెక్టర్ అంకిత్ జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు , వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :