తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కుల పెద్దలు దొడ్డ ముత్తయ్య దొర జెండాను ఆవిష్కరించారు . ఆదివాసి హక్కులకై పోరాడిన కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించిందని తెలిపారు.నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. కార్యక్రమంలో ఎదలపల్లి వెంకటేశ్వర్లు. బొర్రా ఉపేందర్. ఈసం ప్రసాద్. గడిగ వెంకటేశ్వర్లు. కొరస రమేష్. మలక్కం వెంకటేశ్వర్లు. ఈసం చిట్టిబాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ