తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం వీఎంఏ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారి మండపాన్ని దర్శించుకున్న కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ పువ్వులను సైతం పూజించే గొప్ప సాంస్కృతి మనదని, నవరాత్రులు బతుకమ్మ ఆడుతూ మహిళలు కష్టాలను మర్చిపోయి సంతోషంగా గడుపే పండుగ దసరా, దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అష్ట ఆరోగ్యాలతో ప్రజలు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఫహీమ్ దాదా, బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి, ఏఐవైఎఫ్ జిల్లా సహా కార్యదర్శి ఖయ్యుం, సీనియర్ నాయకులు డబ్బేటి గురుమూర్తి, వంశీ, రణధీర్, పింకు,శివ, రోహిత్, శోభ,లత, పింకీ, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ