తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా పరిషత్ సీఈవో చంద్రశేఖర రావు శుక్రవారం మధ్యాహ్నం జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోయింగ్ టాస్కులు ఈజీఎస్ లపై సమావేశాలు నిర్వహించండి అని సూచించారు. ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, సర్వ సభ్య సమావేశాల్లో చేసిన తీర్మానాలు తదితర అంశాల గురించి వివరించారు. మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పంచాయతీల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జడ్పీ సీఈవో ఆదేశించారు. ఇప్పటికే పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష జరిపామని, ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేపడుతున్నామని ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ