తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శనివారం 26వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఐ డి ఓ సి కార్యాలయం లో దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కో చైర్మన్ మెహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ , జడ్పీ చైర్మన్, శాసనమండలి, శాసనసభ్యులు, దిశా కమిటీ సభ్యులు మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొననున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ యొక్క సమావేశంలో అన్ని శాఖల అధికారులు తమ శాఖలలో చేపడుతున్న పనుల పై నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ