తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం 11వ వార్డు చిట్టి రామవరం ప్రభుత్వ పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను మననం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో జయశంకర్ పోషించిన పాత్ర మరువలేనిది చెప్పారు జయశంకర్ సార్ 19 69 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా ఆచార్య జయశంకర్ నిలిచారని పేర్కొన్నారు జయశంకర్ సార్ కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలో చక్కటి ప్రామిణ్యం ఉందని తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు కార్యచరణ ప్రణాళికలు రూపొందించారని ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కౌన్సిలర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉష, వార్డు స్పెషల్ ఆఫీసర్ చాంద్ పాషా, జిఎన్ఎమ్ వసంత దేవి, డ్వాక్రా ఆర్పి కావేరి, అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి, తులసి బాయ్, అటెండర్లు ఈశ్వరి, భవాని, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ