Saturday, 19 September 2026 04:20:33 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి.

Date : 06 June 2026 07:15 PM Views : 132

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న మండల మహిళా సమాఖ్య ఆర్టిసి బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తగిన చర్యలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.మరో రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను అదేశించారు.శనివారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వరి కొనుగోలు ప్రక్రియ, జూన్ 9న జరిగే మండల మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కలిసి కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు.జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తూకం వేసిన వడ్లు వెనువెంటనే లారీల్లో మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. రెండు మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా చూడాలని సూచించారు.జూన్ 9వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మండల మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమంజిల్లాల్లోని అన్ని బస్సులు ఆయా మండలాల నుంచి మహిళా సంఘాల సభ్యులను తీసుకొని సాయంత్రం 4 గంటల లోపల హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కి చేరుకునే విధంగా చూడాలని సూచించారు. మహిళలకు మార్గమధ్యలో భోజనాలు, తాగు నీరు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలన్నారు.నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డి సి ఓ ప్రేమ్ కుమార్, డీఎం సివిల్ సప్లై అధికారి త్రినాథ్ బాబు, ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సూపర్నెంట్ వెంకటరమణ,విద్యా శాఖ ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :