తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులు అధైర్య పడవద్దు.... అండగా ఉంటాం . పంటనష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్ మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలతో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని విషయాన్ని తెలుసుకుని దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు పరిశీలించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాలు, వదల కారణంగా జరిగిన పంటల నష్టంపై అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశిస్తూ , ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని పంపిణీ చేసే విధంగా కృషి చేస్తానని ఆయన అంటూ అధైర్య పడకండి అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. కె. సాబీర్ పాషా, , తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపిడివో భారతి, వ్యవసాయశాఖ అధికారిని నర్మదా,మండల అధికారులు , సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ