Monday, 03 August 2026 06:37:57 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 03 August 2026 04:49 PM Views : 22

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేసి వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రగతి మైదానంలో ప్రధాన వేదికను ఆకర్షణీయంగా రూపొందించడంతో పాటు ప్రోటోకాల్‌కు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అధికారులు, విశిష్ట అతిథులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సక్రమంగా ఏర్పాటు చేసి బ్యారికేడ్లు, పార్కింగ్, సూచిక బోర్డులు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు వేదిక, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచి సౌండ్ సిస్టమ్, మైకులు, లైటింగ్, ఎల్‌ఈడీ స్క్రీన్లు ముందస్తుగా పరీక్షించాలని సంబంధిత శాఖలకు సూచించారు. వేడుకల ప్రాంగణంలో 108 అంబులెన్స్, వైద్య బృందాలు, ప్రథమ చికిత్స కేంద్రం, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని ఆరోగ్య శాఖకు ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫైర్ టెండర్లను సిద్ధంగా ఉంచాలని, పోలీసు శాఖ ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం భారత ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా అత్యంత గౌరవప్రదంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని తెలిపారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, అటవీ, వైద్యం, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఆర్టీసీ తదితర శాఖలు తమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు నిర్వహించి జాతీయ భావనను పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రశంసా పత్రాల ప్రదానం కోసం శాఖల వారీగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగుల వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి సమన్వయంతో పనిచేసి జిల్లా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిఆర్ఓ పద్మావతి, జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :