తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కొత్తగూడెం టౌన్ బూడిదగడ్డ బస్తీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం (25)గా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ