Thursday, 05 November 2026 01:58:12 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించిన క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 30 September 2026 06:20 PM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులుక్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచి 111 పాయింట్లతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.జిల్లా క్రీడాకారులు వివిధ విభాగాల్లో 12 బంగారు, 9 వెండి, 6 కాంస్య పతకాలు సాధించి మొత్తం 27 పతకాలు సాధించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ విజేతలైన యువ క్రీడాకారులను అభినందించారు. మారుమూల గ్రామాల్లో నివసిస్తూ కనీస వసతులు, సదుపాయాలు అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టడం ఎంతో గర్వకారణమని అన్నారు.క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలతో పాటు చదువుపై కూడా సమానమైన శ్రద్ధ చూపుతూ విద్యలోనూ రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని సూచించారు.జిల్లా యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటిన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :